ఖేల్‌రత్నకు విరాట్... ద్రోణాచార్యకు ది వాల్

     Written by : smtv Desk | Thu, Apr 26, 2018, 01:48 PM

ఖేల్‌రత్నకు విరాట్... ద్రోణాచార్యకు ది వాల్

ముంబై, ఏప్రిల్ 26 : టీమిండియా క్రికెట్ సారథి విరాట్ కోహ్లి పేరు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేసినట్టు బీసీసీఐ తెలిపింది. విరాట్ తో పాటు మాజీ క్రికెటర్, భారత్ అండర్ 19 కోచ్‌ రాహుల్ ద్రావిడ్ కు ద్రోణాచార్యకు, మరో మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ను ధ్యాన్‌చంద్‌ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు బీసీసీఐ సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రస్తుతం కోహ్లి టెస్టు, వన్డే, టీ-20ల్లో భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తూ.. తనదైన శైలిలో చేలిరేగిపోతున్నాడు.

'ఖేల్‌రత్న కోసం బీసీసీఐ కోహ్లీ పేరు పంపడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఈ అవార్డు కోసం కోహ్లీ పేరు పంపగా రియో ఒలింపిక్‌ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్‌, తృటిలో పతకం కోల్పోయిన దీప కర్మాకర్‌కు అందించారు. అందుకే ఈ ఏడాది కోహ్లీ పేరును పంపించాం' అని రాయ్‌ తెలిపారు. భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు కోచ్‌ ది వాల్ ద్రవిడ్‌ ఈ ఏడాది ప్రపంచ కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు.





Untitled Document
Advertisements