మిస్టర్ కూల్ సిక్స్ లు ... ఐపీఎల్ రికార్డులు

     Written by : smtv Desk | Thu, Apr 26, 2018, 06:08 PM

మిస్టర్ కూల్ సిక్స్ లు ... ఐపీఎల్ రికార్డులు

బెంగళూరు, ఏప్రిల్ 26 : చాలా రోజుల తర్వాత చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. అతని సిక్స్ లకు చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. నిన్న బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని ధోని, రాయుడు ఇద్దరు మెరుపు బ్యాటింగ్ తో ఛేదించారు. ఈ మ్యాచ్ లో ధోని 70 పరుగులతో నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. వాటిలో ఒక ఫోర్, ఏడూ సిక్స్ లు ఉన్నాయి. మరో పక్క రాయుడు (82) మూడు ఫోర్లు, ఎనిమిది సిక్స్ లు నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం బౌండరీల సంఖ్య 51. ఇందులో 18 ఫోర్లు ఉండగా... 33 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన మ్యాచ్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో, గత ఏడాది గుజరాత్‌ లయన్స్‌-దిల్లీ డేర్‌ డెవిల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 31 సిక్స్‌లు నమోదవ్వడమే ఇప్పటి వరకు అత్యధికం. ఇప్పుడు ఈ రికార్డును చెన్నై-బెంగళూరు మ్యాచ్‌ బద్దలు కొట్టింది. ఇదే కాకుండా ఈ మ్యాచ్ లో నమోదైన ఐపీఎల్‌ రికార్డులను పరిశీలిస్తే...

*సీఎస్‌కే గతంలోనూ(2012 చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో) 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీపై చేధించింది.

* ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా ధోనీ రికార్డు. ఇంతకు ముందు ఇది గంభీర్‌ పేరిట ఉంది.

* ఉమేశ్‌ యాదవ్‌కి ఇది 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌. వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు.

* ఒక సీజన్‌లో 200 ప్లస్‌ పరుగుల టార్గెట్‌ను రెండుసార్లు చేధించిన రెండో జట్టుగా సీఎస్‌కే. (ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 203 పరుగుల టార్గెట్‌ను చేధించింది) గతంలో కింగ్స్‌​ ఎలెవన్‌ పంజాబ్‌ ఈ ఫీట్‌ సాధించింది. 2014 సీజన్‌లో దక్కన్‌ ఛార్జర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లపై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గెలిచింది.





Untitled Document
Advertisements