చైనా ప్రచారకర్తగా బాలీవుడ్ సూపర్ స్టార్..!

     Written by : smtv Desk | Fri, Apr 27, 2018, 04:03 PM

చైనా ప్రచారకర్తగా బాలీవుడ్ సూపర్ స్టార్..!

బీజింగ్‌, ఏప్రిల్ 27 : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ భారత్‌ తరఫున చైనా ప్రచారకర్తగా నియమించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైవిధ్యమైన కథలతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న ఆమిర్‌ ఖాన్‌ కు చైనాలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన 'దంగల్', 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌'భారత్‌లో కంటే చైనాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టాయి. చైనీయులకి ఆమిర్‌పై ఉన్న అభిమానం చూసి మోదీ ప్రభుత్వం ఆయన్ను భారత్‌ తరఫున చైనా ప్రచారకర్తగా నియమించనున్నట్లు సమాచారం.

దీనిపై చైనా ప్రతినిధి మీడియా ద్వారా స్పందించారు. 'భారతీయ నటుడు ఆమిర్ ఖాన్‌ ఎంత పాపులరో మాకూ తెలుసు. నాతో పాటు చాలా మంది చైనీయులకు 'దంగల్‌', ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్’ సినిమా చూశాక ఆమిర్‌పై అభిమానం పెరిగింది' అని పేర్కొన్నారు. అయితే ఆమిర్‌ను ప్రచారకర్తగా నియమిస్తున్న విషయం గురించి మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు చైనాలోని వుహాన్‌లో విస్తృతమైన చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్తలు వెలువడటం గమనార్హం.





Untitled Document
Advertisements