'పోక్సో' కేసుల విచారణ వేగవంతం చేయండి : సుప్రీం

     Written by : smtv Desk | Wed, May 02, 2018, 11:03 AM

'పోక్సో' కేసుల విచారణ వేగవంతం చేయండి : సుప్రీం

న్యూఢిల్లీ, మే 2: చిన్నారులపై జరుగుతున్నా అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేయాలని అన్ని హైకోర్టులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు న్యాయస్థానాల్లో సత్వరమే పరిష్కరమయ్యేలా ఓ కమిటీని ఏర్పాటుచేయాలని హైకోర్టులను ఆదేశించింది. అలాగే అన్ని రాష్ట్రాలకు చెందిన డీజీపీలు ఈ అంశంపై ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసి కేసుల్ని విచారించాలని సూచించింది.

దేశంలో బాలికలపై రోజురోజుకూ పెరిగిపోతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టానికి ఇటీవల కేంద్రం కీలక సవరణలు చేసింది. 12ఏళ్లలోపు బాలికలపై అమానుషానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తూ అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్‌) తీసుకొచ్చిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements