ఉత్కంఠ పోరు.. ఢిల్లీదే జోరు

     Written by : smtv Desk | Thu, May 03, 2018, 11:01 AM

ఉత్కంఠ పోరు.. ఢిల్లీదే జోరు

ఢిల్లీ, మే 3 : ఢిల్లీ డేర్ డెవిల్స్ యువ ఆటగాళ్లు రెచ్చిపోయి తమ బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించారు. టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌పై గెలిచింది. ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కల్పించడంతో మ్యాచ్ 18 ఓవర్లకు కుదించారు. తొలుత టాస్ నెగ్గిన రాజస్థాన్ ప్రత్యర్దికు బ్యాటింగ్ అప్పగించింది.


ఢిల్లీ జట్టులో యువ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌ (69), శ్రేయస్‌ అయ్యర్‌ (50), పృథ్వీ షా (47) రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు సాధించింది. 18 ఓవర్ల ఇన్నింగ్స్‌ వర్షం వల్ల 17.1 ఓవర్ల వద్దే ముగిసింది. దీంతో డ/లూ ప్రకారం రాజస్థాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లలో 151 పరుగులకు సవరించారు. లక్ష్య ఛేదన లో రహనే సేన 5 వికెట్లకు 146 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. బట్లర్(67), షార్ట్ (44) పోరాడిన జట్టును గెలిపించాలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రిషిబ్ పంత్ కు దక్కింది.





Untitled Document
Advertisements