టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఆర్.కృష్ణయ్య!

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 12:12 PM

టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఆర్.కృష్ణయ్య!

హైదరాబాద్, మే 4: వెనుకబడిన సంఘాల నేత, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే రాగ్య కృష్ణయ్య అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొంతకాలంగా తన విషయంలో, ఏపీలోని బీసీల విషయంలోనూ అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్నఆయన ఇక టీడీపీకి గుడ్ బై చెప్పడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఏపీలో తాను గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఓ ఉద్యోగ సంఘానికి అధికారిక గుర్తింపు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించిందన్న ఆగ్రహంతో ఉన్న ఆయన, తాను ఆ పదవి నుంచి వైదొలగితే వెంటనే గుర్తింపు ఇస్తామంటూ ప్రభుత్వం మెలిక పెడుతోందని మండిపడుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Untitled Document
Advertisements