ఇలాగైతే అభివృద్ధి ఎలా అవుతుంది : రాహుల్ గాంధీ

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 12:37 PM

ఇలాగైతే అభివృద్ధి ఎలా అవుతుంది : రాహుల్ గాంధీ

బెంగళూరు, మే 4 : కర్ణాటక ఎన్నికల రోజు దగ్గర పడడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం జోరందుకుంది. కేంద్రం ఇచ్చే స్వల్ప నిధులతో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మోదీని ప్రశ్నించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రధాని మోదీ.. సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరును పాపాల లోయ (సిన్‌ వ్యాలీగా), ఉద్యానాల నగరి (గార్డెన్‌ సిటీ)ని చెత్త నగరం (గార్బేజ్‌ సిటీ)గా మార్చేశారని కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దీనిపై రాహుల్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. "ప్రియమైన మోదీజీ... మీరు బెంగళూరును నేరాల నగరి అనీ, చెత్త నగరం అని సంబోధించి అవమానించారు. కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇన్నేళ్లలో మీరు కేటాయించిన నిధులతో నగరాల అభివృద్ధి అసలే సాధ్యం కాదు. అలాంటిది మీరిలా మాట్లాడటం సరికాదు. మీ మాటలు ఎంతమాత్రం నిజమో ఈ డేటా చూస్తే తెలుస్తోంది. మీకంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం 1100% ఎక్కువ నిధులు కర్ణాటక నగరాల అభివృద్ధికి కేటాయించింది. కాంగ్రెస్‌ రూ.6,570కోట్లు కేటాయిస్తే... భాజపా ప్రభుత్వం రూ.598కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇలాగైతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? " అని ట్వీట్ చేశారు.





Untitled Document
Advertisements