సైకిల్‌ యాత్రలో ఎంపీకి స్వల్ప అస్వస్థత

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 04:24 PM

సైకిల్‌ యాత్రలో ఎంపీకి స్వల్ప అస్వస్థత

చింతలపూడి, మే 4: పశ్చిమ గోదావరి జిల్లా చింతల పూడిలో సైకిల్‌ యాత్రలో పాల్గొంటోన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు. సైకిల్‌ తొక్కుతూ ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే ఆయనను భద్రతాసిబ్బంది, టీడీపీ కార్యకర్తలు ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందించామని, ఆయనకు స్వల్ప గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Untitled Document
Advertisements