నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్: పొన్నాల

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 05:19 PM

 నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్: పొన్నాల

హైదరాబాద్, మే 4‌: ఇంటికో ఉద్యోగం ఏది కేసీఆర్‌.. ఉద్యోగం ఇస్తామంటే ప్రజలు వద్దంటారా అనిమాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి వస్తే ఒక్క ఏడాదిలోనే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాని మోదీ సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి జరగకపోగా, నాలుగేళ్లలో దాదాపు ఏడు వేల చిన్నతరహా పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు. ఈ సారి బడ్జెట్‌లో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.1,100 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో ఆ ఇళ్లు పూర్తి కావడానికి 120 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.

Untitled Document
Advertisements