రైతు బంధు పథకానికి సర్వం సిద్ధం: గుత్తా

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 05:49 PM

రైతు బంధు పథకానికి సర్వం సిద్ధం: గుత్తా

నల్గొండ, మే 4: రైతులకు పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 10న ప్రారంభంకానున్న ఈ పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెక్కులు.. పాస్ పుస్తకాలు జిల్లాలకు చేరుకున్నాయన్నారు.అలాగే రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

ప్రభుత్వం అందించే చెక్కులు మూడు నెలల్లో ప్రభుత్వం సూచించిన బ్యాంకుల్లో డ్రా చేసుకోవచ్చన్నారు. సకాలంలో చెక్కులు తీసుకోలేనివారు ఆయా ఎమ్మార్వో కార్యాలయాల్లో చెక్కులు తీసుకోవచ్చన్నారు.

Untitled Document
Advertisements