దాచేపల్లి ఘటనపై రాజకీయం చేస్తున్న వైకాపా: తెదేపా

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 06:19 PM

దాచేపల్లి ఘటనపై రాజకీయం చేస్తున్న వైకాపా: తెదేపా

విజయవాడ, మే 4: వైకాపా నేతలు దాచేపల్లి ఘటనతో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఏపీ మహిళా ఆర్థికాభివృద్ధి సంస్థ అధ్యక్షురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఘటనకు రాజకీయ రంగు పులమాలని వైకాపా నాయకులు రోజా, పద్మలు చేసిన ప్రయత్నాన్ని ఖండించారు.

విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దాచేపల్లిలో అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి స్థానిక నాయకులు, మంత్రులకు బాధితురాలి కుటుంబానికి అండగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. దాచేపల్లి ఘటనలో నిందితుడి తమ్ముడి కుమారుడు వైకాపా మద్దతుదారుడు కాదా అని ఆమె ప్రశ్నించారు.

Untitled Document
Advertisements