ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 11:27 AM

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్, మే 5 ‌: సనత్‌నగర్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణమైన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంబవించింది. అకస్మాత్తుగా గోదాములో మంటలు చెలరేగి అందులో ఉంచి దుస్తులన్నీ దగ్దమయ్యాయి. ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

విషయం తెల్సుకొన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని ఐదు గంటల పాటు నాలుగు అగ్నిమాపక శకటాల సహాయంతో శ్రమించి మంటలను అదుపు చేశారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Untitled Document
Advertisements