కూచిభొట్ల హంతకుడికి తగిన శాస్తి..

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 11:57 AM

కూచిభొట్ల హంతకుడికి తగిన శాస్తి..

అమెరికా, మే 5 : హైదరాబాద్‌ టెకీ శ్రీనివాస్‌ కూచిభొట్ల(33) హంతకుడికి తగిన శాస్తి జరిగింది. ఈ కేసులో అమెరికా నేవీ మాజీ సైనికుడు ఆడమ్‌ ప్యురిన్‌టన్‌(52) కు అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుడు ఆడమ్‌ డబ్య్లూ పురింటన్ జాత్యాహంకారంతోనే శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి అతడిని హత్య చేసినట్లు న్యాయస్థానం నిర్థారించి జీవిత ఖైదు శిక్ష వేసింది.

2017 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చెందిన కూచిబొట్ల శ్రీనివాస్‌, అతని స్నేహితుడు అలోక్‌ మదసాని కెన్సస్‌లోని ఒలేత్‌ నగరంలోని ఓ బార్‌లో ఉండగా అమెరికాకు చెందిన 52ఏళ్ల ఆడమ్‌ ‘మా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ నినాదాలూ చేస్తూ వారిద్దరిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్సపొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు.

ఈ తీర్పు అనంతరం కూచిబొట్ల భార్య సునయన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..."ఈ తీర్పుతో శ్రీనివాస్‌ తిరిగి రారు. కానీ ఇలాంటి ఘటనలు ఇకముందైనా జరగకుండా చూడండి. ఈ కేసులో మాకు అండగా నిలబడిన ఓలేత్‌ పోలీసులకు ధన్యవాదాలు" అని తెలిపారు.





Untitled Document
Advertisements