విమాన టికెట్ @ రూ.1399

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 04:34 PM

విమాన టికెట్ @ రూ.1399

న్యూఢిల్లీ, మే 5 : విమాన ప్రయాణికులకు శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. సెలవులో సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు విమానయాన సంస్థలు వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఏషియా కూడా పరిమిత కాల వ్యవధిలో బుక్‌ చేసుకునే టికెట్లకు డిస్కౌంట్లు ఇస్తోంది. కొన్ని ఎంపిక చేసిన రూట్లలో ఆఫర్లను అందిస్తోంది. దేశీయంగా కొన్ని రూట్లలో టికెట్‌ ధర అతి తక్కువగా రూ.1399 ఉంది. అయితే 2018 మే 13లోగా టికెట్లు బుక్‌ చేసుకునే వారికే ఈ అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్‌ అక్టోబరు 31లోపు ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.

టికెట్ ధరలు..
>> భువనేశ్వర్‌-కోల్‌కతా, రాంచీ-కోల్‌కతా రూట్లలో టికెట్‌ ధర రూ.1399.
>> భువనేశ్వర్-రాంచీ (రూ.1699),
>> భువనేశ్వర్‌- హైదరాబాద్‌ (రూ.1799),
>> భువనేశ్వర్‌-చెన్నై (రూ.1899),
>> నాగ్‌పూర్‌-బెంగళూరు (రూ.2,399),
>> నాగ్‌పూర్‌-కోల్‌కతా(రూ.2,299),
>> భువనేశ్వర్‌-బెంగళూరు(రూ.2,299).

దేశీయ విమానాల టికెట్లతో పాటు అంతర్జాతీయ విమాన టికెట్లపైనా ఆఫర్లున్నాయి. అంతర్జాతీయంగా అతి తక్కువగా టికెట్‌ ధర రూ.3,555గా ఉంది.

>> అమృత్‌సర్‌-కౌలాలంపూర్‌ విమాన టికెట్‌ రూ.3,555.
>> భువనేశ్వర్‌- కౌలాలంపూర్‌- జకార్తా (రూ.4,793),
>> భువనేశ్వర్‌- కౌలాలంపూర్‌- బ్యాంకాక్‌(రూ.5,242),
>> భువనేశ్వర్‌-కౌలాలంపూర్‌-జోహోర్‌ బహ్రు(రూ.4,875),
>> భువనేశ్వర్‌- కౌలాలంపూర్‌- సింగపూర్‌ (రూ.4,607).

Untitled Document
Advertisements