బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి మాధవీలత

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 05:06 PM

బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి మాధవీలత

హైదరాబాద్, మే 5: ప్రముఖ నటి మాధవీలతతో పాటు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు తెలంగాణ బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శనివారం శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన బీజేపీ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ సమక్షంలో కాంగ్రెస్ నేత అమర్ సింగ్, సినీ నటి మాధవీలత, కేయూ మాజీ వీసీ వైకుంఠం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితిన్ గడ్కరీ.. ముఖ్య నేతలు బీజేపీలో చేరడం శుభపరిణామం అన్నారు. చేరికలతో తెలంగాణలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements