రైలు ప్రయాణికులకు శుభవార్త

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 05:15 PM

రైలు ప్రయాణికులకు శుభవార్త

న్యూఢిల్లీ, మే 5 : రైలు ప్రయాణికులకు భారత రైల్వే సంస్థ ఓ శుభవార్త అందించింది. ఇప్పటికే రైలు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పలు సేవలను రైల్వే శాఖ ప్రవేశపెడుతోంది. టికెట్ బుక్ చేసుకున్నాక వెళ్లాల్సిన రైలు రద్దయితే ఆ సొమ్ము కోసం ఏం చేస్తాం..? ఇప్పటివరకు రైల్వే అధికారులు ఇచ్చే టికెట్‌ డిపాజిట్‌ రశీదు (టీడీఆర్‌)ను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని తిరిగి పొందుతున్నాం. ఇక నుండి ఆ పద్దతికి రైల్వే సంస్థ ఫుల్ స్టాప్ పెట్టింది.

"రైలు ప్రారంభ స్టేషన్‌ నుంచి చివరి స్టేషన్‌ వరకు సేవలు రద్దు అయితే వెంటనే టికెట్‌ పీఎన్‌ఆర్‌(ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డ్‌) కూడా క్యాన్సిల్‌ అవుతుంది. ప్రయాణికులు ఏ ఖాతా నుంచి టికెట్‌ను బుక్‌ చేసుకున్నారో దానికే నగదు వాపస్‌ అవుతుందని" రైల్వే శాఖ ట్వీట్‌ చేసింది. ఎటువంటి టీడీఆర్‌ను సమర్పించాల్సిన అవసరం ఉండదు. అందులో భాగంగా అత్యవసర సందర్భల్లో చివరి నిమిషంలోనూ తత్కాల్‌ పద్ధతి ద్వారా టికెట్లను బుక్‌ చేసుకునే సౌలభ్యం కల్పించింది.





Untitled Document
Advertisements