నరసాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 06:48 PM

నరసాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు

నరసాపూర్, మే 5: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి సౌకర్యార్థం ఈ నెల 6వ తేదీ నుంచి ఈరైలుప్రారంభమవుతుంది. మే, జూన్‌ నెలల్లో ఈ రైలును నడపనున్నారు.

తరువాత కూడా అదే తరహాలో రద్దీ ఉంటే ఈ సర్వీస్‌ను శాశ్వతంగా కొనసాగిస్తారని నరసాపురం రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ మధుబాబు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్‌ చేరుకుంటుంది. 4 జనరల్‌ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉందని స్టేషన్‌ మాస్టర్‌ తెలిపారు.

Untitled Document
Advertisements