వైద్యం కోసం వెళ్ళిన మహిళపై అత్యాచారం!

     Written by : smtv Desk | Sat, May 05, 2018, 07:17 PM

వైద్యం కోసం వెళ్ళిన మహిళపై అత్యాచారం!

హైదరాబాద్‌, మే 5: వైద్యం కోసం ఉస్మానియాకు వెళ్ళిన మహిళపై దారుణం జరిగింది. భర్త కొట్టాడని ఓ మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వైద్యం కోసం ఆమెను ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రి పంపించడంతో.. కీచకులు బాధితురాలిపై అత్యాచారం జరిపారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది.

ఒంటరిగా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లడంతో.. అక్కడ తనపై వార్డ్‌బాయ్‌ నాగరాజు, హోంగార్డ్‌ ఒమర్‌ లైంగిక దాడి చేశారని బాధితురాలు ఆఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Untitled Document
Advertisements