ఖైరతాబాద్‌లో కలకలం సృష్టించిన టిఫిన్‌ బాక్స్‌

     Written by : smtv Desk | Sun, May 06, 2018, 03:49 PM

 ఖైరతాబాద్‌లో కలకలం సృష్టించిన టిఫిన్‌ బాక్స్‌

హైదరాబాద్, మే 6 : నగరంలోని ఖైరతాబాద్‌ సర్కిల్‌లో ఆదివారం టిఫిన్‌ బాక్స్‌ అలజడి సృష్టించింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఖైరతాబాద్‌ సర్కిల్‌లో ఆనందనగర్‌ కాలనీలోకి వెళ్లే మార్గంలో ఏపీ16ఇజి 0786 నంబరు కలిగిన తెలుపు రంగు బీఎండబ్ల్యూ కారు, దాని పక్కనే టిఫిన్‌ బాక్స్‌ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో బాంబుస్క్వాడ్‌, డాగ్ ‌స్కాడ్‌ బృందాలు రంగంలోకి దిగి ఆ టిఫిన్‌ బాక్స్‌లో ఏమీ లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

టిఫిక్‌బాక్స్‌ను తనిఖీ చేసి అందులో పేలుడు పదార్థాలు ఏమీ లేవని తేల్చారు. బాక్స్‌ తెరచి చూడగా అందులో అన్నం ఉంది. కారు యజమానిని పిలిపించి విచారించగా తాను గ్యాస్‌ కట్టర్‌ కోసం వెళ్లినట్లు చెప్పాడు. టిఫిన్‌ బాక్స్‌ అలా నిర్లక్ష్యంగా బయట ఎందుకు వదిలేసి వెళ్లారని ప్రశ్నిస్తూ అతడిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనుమానించదగ్గ ఆధారాలు ఏమీ లేవని నిర్ధారించుకుని అతడిని వదిలిపెట్టినట్లు పంజాగుట్ట సీఐ రవీందర్‌ వెల్లడించారు.

Untitled Document
Advertisements