అర్హులైనవారందరికీ సక్రమంగా చెక్కుల పంపిణీ " కేసీఆర్

     Written by : smtv Desk | Mon, May 07, 2018, 11:31 AM

అర్హులైనవారందరికీ సక్రమంగా చెక్కుల పంపిణీ

హైదరాబాద్, మే 7 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైనవారందరికీ చెక్కులను సక్రమంగా పంపిణీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు.. అధికారులంతా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. కార్యక్రమం జరిగే రోజుల్లో అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి, పర్యవేక్షించాలన్నారు.

ఈ నెల 10న హుజురాబాద్‌ ఇందిరానగర్‌లో ఈ పథకాన్ని ఉదయం 11 గంటలకు తాను ప్రారంభిస్తానని, అదే రోజు ఉదయం 11.15కి అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని అధికారికంగా ఆరంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే పాసుపుస్తకాలు, చెక్కులు జిల్లాలకు చేరాయి. వాటిని అన్ని గ్రామాలకు చేర్చి.. ఏ గ్రామంలో ఏ రోజు కార్యక్రమం ఉంటుందో, దానిని స్థానికంగా డప్పు చాటింపులు, ఇతర ప్రసారమాధ్యమాల ద్వారా రైతులకు తెలియజేయాలి అని సీఎం సూచించారు. ఈ నెల 10న హుజురాబాద్‌ మండలం ఇందిరానగర్‌ వద్ద జరిగే కార్యక్రమం ఏర్పాట్లను.. సభాస్థలిని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారని వివరించారు.

Untitled Document
Advertisements