కన్నడ బరిలో కోటీశ్వరులు, నేరగాళ్లు

     Written by : smtv Desk | Tue, May 08, 2018, 11:21 AM

కన్నడ బరిలో కోటీశ్వరులు, నేరగాళ్లు

బెంగళూరు, మే 8 : ఈ నెల 12 నుండి కర్ణాటక ఎన్నికల సంగ్రామం కోసం అధికారమే ధ్యేయంగా ప్రచారం సాగిస్తున్నాయి. 2,654 మంది అభ్యర్థులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. వారిలో కొందరు నేరగాళ్లు, వందల సంఖ్యలో కోటీశ్వరులు ఉన్నారు.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌ అనే సంస్థ "ఈ ఎన్నికల్లో 883 మంది కోటీశ్వర్లు పోటీపడుతున్నారు. వారి సరాసరి ఆస్తుల విలువ రూ. 7.54 కోట్లు. 645 మందిలో 254 మంది తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 391 మంది మీద క్రిమినల్‌ కేసులు ఉన్నాయి" అని తెలిపింది.

కాంగ్రెస్‌లో 94 శాతం మంది, జనతాదళ్ పార్టీలోని 199 మందిలో 154 మంది, 1090 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 199 మందికి కోటి రూపాయల ఆస్తులు ఉన్నట్లు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మే 12న అన్నినియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను మే 15న వెల్లడించనున్నారు.






Untitled Document
Advertisements