నయీం దోస్తులంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు: చాడ

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 01:11 PM

నయీం దోస్తులంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు: చాడ

హైదరాబాద్, మే 9‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను, కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘమే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందని, టీఎంయూ నేతృత్వంలోనే బస్‌భవన్‌ను ముట్టడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో చర్చిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని అన్నారు. 3 రోజులపాటు మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశం వివరాలను చాడ వివరించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై ఉద్యోగులు, యువకులు, రైతులతోసహా అన్ని వర్గాలు ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నాయ ని చెప్పారు. జూన్‌ 2న అమరవీరుల ఆకాంక్ష దినం జరుపుతామని, గద్దర్, విమలక్కతో సహా కళాకారులతో ఆటపాటలు, ధూంధాం నిర్వహిస్తామన్నారు .





Untitled Document
Advertisements