మోదీ మరో ఘనత

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 01:41 PM

మోదీ మరో ఘనత

న్యూయార్క్‌, మే 9 : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ఘనత దక్కించుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో టాప్‌ టెన్‌లో మోదీ చోటు సంపాదించారు. ప్రముఖ మ్యాగజైన్‌‌ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఈ జాబితాలో మోదీ 9వ స్థానంలో నిలిచారు.

ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచారు. శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ను దాటేసి జిన్‌పింగ్‌ ఈసారి తొలిస్థానం కైవసం చేసుకున్నారు.

2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించింది. ‘ఈ భూమ్మీద 7.5 బిలియన్ల మనుషులు జీవిస్తున్నారు. ఇందులో 75 మంది వ్యక్తులు శక్తిమంతమైన వారిగా నిలిచారు. అంటే ప్రతి 10కోట్ల మందిలో ఒక శక్తిమంతమైన వ్యక్తి ఉన్నారు’ అని ఫోర్బ్స్‌ పేర్కొంది.

టాప్ టెన్ స్థానాలు...
1. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌
2. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌
3. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
4. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌
5. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌
6. పోప్‌ ఫ్రాన్సిస్‌
7. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌
8. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సాద్‌
9. భారత ప్రధాని మోదీ
10. ఆల్ఫాబెట్‌ సీఈవో లారీ పేజ్‌





Untitled Document
Advertisements