ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తా౦

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 06:41 PM

ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తా౦

విజయవాడ, మే 9: ఏపీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు అన్నారు. విభజన హామీల సాధన కోసం ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనడానికి కొంత సమయం తీసుకున్నామని తెలిపారు.

ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో దీక్షలతో అభివృద్ధి అగిపోతుందనే ఇంతకాలం వేచి చూశామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపై హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు.

Untitled Document
Advertisements