భారీ వర్షంతో కేసీఆర్ మీటింగ్‌కు అంతరాయం

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 07:23 PM

భారీ వర్షంతో కేసీఆర్ మీటింగ్‌కు అంతరాయం

మెదక్, మే 9: ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా కార్యక్రమానికి అంతరాయమేర్పడింది. సభా స్థలిలోని టెంట్లు భారీ వర్షానికి కూలిపోయాయి.

రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత, జిల్లా కేంద్రాల్లో పరిపాలనా భవనాల సముదాయాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయకు నేడు శంకుస్థాపనచేయనున్నారు. మరి కాసెపట్లో సీఎం రానున్న నేపధ్యంలో అధికారులు సభా ప్రాంగణాన్ని పునరుద్ధరిస్తున్నారు.

Untitled Document
Advertisements