రైతుబంధు పథకం ఓ మోసం: దాసోజు

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 11:12 AM

 రైతుబంధు పథకం ఓ మోసం: దాసోజు

హైదరాబాద్, మే 10‌: నాలుగేళ్లుగా రైతుల సమస్యలను పట్టించుకోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పేరిట హడావుడి చేస్తుండటం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. రుణమాఫీ కాక 35 లక్షల పాస్‌ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయన్నారు.

4,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని సీఎం ఇప్పుడు రైతుబంధు అంటూ వారిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ రైతుబంధు కాదని, రైతు రాబందు అని శ్రవణ్‌కుమార్‌ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎకరానికి రూ.4 వేలు కాదని, రూ.40 వేలు ఇచ్చినా రైతుల ఉసురు కేసీఆర్‌కు తగలక మానదని వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements