రేవంత్ వ్యాఖ్యలు సరికావు: కోమటిరెడ్డి

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 11:25 AM

రేవంత్ వ్యాఖ్యలు సరికావు: కోమటిరెడ్డి

హైదరాబాద్, మే 10: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని సీనియర్లను కించపరిచేలా ఉన్నాయని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీని బంగారం చేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... అంత సత్తా ఉంటే టీడీపీనే బంగారం చేసి ఉండాల్సిందని చెప్పారు.

ప్రజాసమస్యలపై తాను ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నానని... తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం కాదనుకుని నిరవధిక దీక్షకు దిగానని, నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్యపై దీక్ష చేపట్టానని చెప్పారు. తమ అసెంబ్లీ సభ్యత్వంపై వేటు పడిన నేపథ్యంలో, గాంధీభవన్ లో రెండు రోజుల దీక్ష చేపట్టడమనేది ఎమ్మెల్యే సంపత్ తో కలసి తాను తీసుకున్న నిర్ణయమని తెలిపారు.

Untitled Document
Advertisements