ఏపీ పాలీసెట్‌ ఫలితాలు విడుదల

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 11:41 AM

 ఏపీ పాలీసెట్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం, మే 10: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ పాలీసెట్‌-2018 ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని తెలిపారు. ఏప్రిల్‌ 12న పాలిసెట్‌ నిర్వహించగా మొత్తం 1,29,412 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు.

మొత్తం 80.19 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. బాలికలు 84.61శాతం, బాలురు 78.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. తూర్పు గోదావరికి చెందిన గీత సౌమ్య, కంకటాల సాయి శ్రీహర్ష, పశ్చిమ గోదావరికి చెందిన పిల్లి శ్రీకర్‌ బాబు మొదటి స్థానాల్లో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా హర్ష రెండో స్థానం, పశ్చిమ గోదావరి జిల్లాకు దినకర్‌బాబు మూడో ర్యాంకు దక్కించుకున్నారు.Untitled Document
Advertisements