చలనచిత్ర ప్రదర్శనలో సరికొత్త ప్రయోగం..

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 11:45 AM

చలనచిత్ర ప్రదర్శనలో సరికొత్త ప్రయోగం..

ఢిల్లీ, మే 10 : దేశరాజధానిలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ చేతులమీదుగా 'మొబైల్‌ డిజిటల్‌ మూవీ థియేటర్‌' ఆరంభమైంది. చలనచిత్ర ప్రదర్శన రంగంలో సామాన్యుడికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వినోదం పంచేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత సతీష్‌ కౌశిక్‌, పారిశ్రామికవేత్త సునీల్‌ చౌదరి కలిసి ‘పిక్చర్‌ టైం’ బ్రాండ్‌ పేరుతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.

6030 అడుగుల వైశాల్యంలోఉండే ఈ తాత్కాలిక థియేటర్‌లో సుమారు 150 నుంచి 200 సీట్లు పడతాయి. సినిమాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు దీంతో మేలు జరుగుతుంది. సినిమా స్థాయిని బట్టి టికెట్టు ధర రూ.30 నుంచి రూ.60వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.





Untitled Document
Advertisements