ఎన్జీవో నేత అశోక్‌బాబుపై చర్యలు తీసుకోండి: బీజేపీ

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 12:05 PM

ఎన్జీవో నేత అశోక్‌బాబుపై చర్యలు తీసుకోండి: బీజేపీ

అమరావతి, మే 10: ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ప్రధానిపై విమర్శలు గుప్పించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు.

పార్టీ అధికార ప్రతినిధులు సుధీష్‌రాంబొట్ల, ఆంజనేయరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లఘించిన అశోక్‌బాబు.. ఇప్పుడు రాజీనామా చేస్తానని చెబుతున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఆయనకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం చెల్లించే గ్రాట్యూటీ, పెన్షన్‌ వంటివి నిలుపుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నామని తెలిపారు.

Untitled Document
Advertisements