నీటి తీరువా వసూళ్లు ఉండవు: సీఎం కేసీఆర్

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 12:41 PM

నీటి తీరువా వసూళ్లు ఉండవు: సీఎం కేసీఆర్

మెదక్, మే 10: రాబోయే రోజుల్లో రైతుల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవని, వాటి బకాయిలు రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, నీటి తీరువా బకాయిలు సుమారు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు ఉన్నాయని, రాబోయే రోజుల్లో రైతుల నుంచి నీటి తీరువా వసూళ్లు ఉండవని అన్నారు.

మెదక్ జిల్లా ప్రజల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సాధించాను. మాయమాటలు చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతోంది. రాష్ట్రంలో 2014కు ముందు విద్యుత్ ఉంటే వార్త.. ఇప్పుడు విద్యుత్ పోతే వార్త. భూ రికార్డుల ప్రక్షాళన కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేశామన్నారు.

Untitled Document
Advertisements