అక్టోబర్ లో ప్రారంభం కానున్న రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జ్

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 12:50 PM

అక్టోబర్ లో ప్రారంభం కానున్న రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జ్

న్యూఢిల్లీ, మే 10 : దేశంలోనే బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన అతిపెద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతుంది. దిబ్రూఘడ్ నుంచి దేహమ్‌జీ‌ల మధ్య 4.94 కిలోమీటర్ల దూరం నిర్మించిన బోగీబీల్ బ్రిడ్జిని ఈ ఏడాది జులై నాటికి పూర్తి చేసి అక్టోబరులో ఆరంభించానున్నారు. చైనా దేశ సరిహద్దుల్లో నిర్మించిన అతి పెద్ద వంతెనపై పై భాగంలో రెండు రైల్వేలైన్లు, కింద మూడు రోడ్డు మార్గాలున్నాయి. సైన్యానికి ఉపయోగపడే ఈ వంతెన వల్ల ప్రయాణ సమయం చాలా తగ్గనుంది.

బ్రహ్మపుత్ర నదిలో బోటులో ప్రయనించాలంటే గంట సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఈ వంతెనను ప్రారంభిస్తే కేవలం ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చని భారతీయ రైల్వే అధికార ప్రతినిధి వేదప్రకాష్ వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణం వల్ల అసోం నుంచి అరుణాచల్ ప్రదేశ్ ల మధ్య ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గనుంది.





Untitled Document
Advertisements