అనిశా వలలో.. ఆలయ ఈవో

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 03:43 PM

అనిశా వలలో.. ఆలయ ఈవో

కర్నూలు, మే 10 :కర్నూలు జిల్లాలో అనిశా వలకు ఓ అవినీతి చెప చిక్కింది. నంద్యాల మూలసాగరంలో ఆలయ ఈవో వీరయ్య ఇంట్లో అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి రూ.10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

బండిఆత్మకూరు మండలం ఓంకారేశ్వరస్వామి ఆలయం, సంజామాల మండలం నయనాలప్ప ఆలయాలకు వీరయ్య ఈవోగా పనిచేస్తున్నారు. వీరయ్య నివాసం సహా ఐదు చోట్ల అనిశా డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి. కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలోనూ వీరయ్య ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయి.

Untitled Document
Advertisements