పరిశ్రమల స్థాపనతో వేల మందికి ఉపాధి: బాబు

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 04:12 PM

పరిశ్రమల స్థాపనతో వేల మందికి ఉపాధి: బాబు

కర్నూలు, మే 10: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు గుట్టపాడు సమీపంలో జయరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.3 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకానుందని, తద్వారా 5 వేల మంది యువతకు ఉపాధి లభించనుందని సీఎం చెప్పారు.

పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని ఆయన అన్నారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తర్వాత ఉర్దూ వర్సిటీ, రూసా క్లస్టర్ వర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Untitled Document
Advertisements