జూన్‌ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం: కేసీఆర్

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 05:31 PM

జూన్‌ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం: కేసీఆర్

కరీంనగర్, మే 10: రైతు బంధు పథకాన్ని జిల్లాలోని హుజురాబాద్ లో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రక్షణ కల్పించాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. జూన్‌ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

ఇకపై సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో, తహశీల్దార్‌ ఆఫీసుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, పాస్‌బుక్కులు పోస్టులోనే ఇంటికి వస్తాయని, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వమని కేసీఆర్‌ స్పష్టం చేశారు.. పంట రుణాలు ఇచ్చేందుకు రైతుల దగ్గర పాసుపుస్తకాలు తీసుకోవద్దని బ్యాంకులకు సూచించారు. చిన్న అగ్రిమెంట్‌పై సంతకం తీసుకుని రుణాలివ్వాలన్నారు.

Untitled Document
Advertisements