రైల్వే శాఖ విన్నూత ఆలోచన.. రైల్వేలో బ్లాక్ బాక్స్‌లు

     Written by : smtv Desk | Thu, May 10, 2018, 06:00 PM

రైల్వే శాఖ విన్నూత ఆలోచన.. రైల్వేలో బ్లాక్ బాక్స్‌లు

న్యూఢిల్లీ, మే 10 : ఇండియన్ రైల్వే శాఖ మరో కొత్త ప్రయోగానికి సన్నాహాలు చేస్తుంది. రైళ్లలో స్మార్ట్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. వాటికీ బ్లాక్ బాక్స్‌లను ఏర్పాటు చేయడంతోపాటు, కోచ్‌ల సమాచారం, ప్రమాదానికి కారణాలు తెలుసుకొనే వ్యవస్థను కంపార్ట్‌మెంట్లలో ప్రవేశపెట్టనుంది. బ్లాక్‌ బాక్స్‌లు సాధారణంగా విమానాల్లో, హెలికాఫ్టర్‌లో ఉంటాయి. ఇప్పుడు వాటిని రైల్వేల్లోకి మొదటిసారి తీసుకురానున్నారు.

కోచ్ కండిషన్, ప్రయాణికులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సదుపాయాలతో ఉన్న స్మార్ట్ కోచ్‌ను జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా పైలట్ ప్రాజెక్టు కింద రాయ్‌బరేలీలో మే 11న ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్ల ద్వారా రైలు పట్టాలు తప్పడం, ఆలస్యానికి కారణాలు, మౌలిక సదుపాయాల్లో ఉండే సమస్యలు గుర్తించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.





Untitled Document
Advertisements