అల్పాహారం ఆరగించండి..!

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 03:36 PM

అల్పాహారం ఆరగించండి..!

హైదరాబాద్, మే 10 : ఉదయం పూట తినే అల్పాహారం శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అందుకే అన్ని పనులున్న టిఫిన్ మాత్రం తినడం మానేయకూడదు. దాని వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

>> చాలామంది ఉద్యోగం చేసే మహిళలు ఉదయం టిఫిన్ తీసుకోవడంలో అనాసక్తి చూపిస్తారు. దీనికి వారు చెప్పే కారణం సమయం లేకపోవడమే. కానీ తినడం వల్ల రోజువారీ పనులకు అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది.

>> కొంతమంది మహిళలు టిఫిన్‌ మానేయడం వల్ల బరువు తగ్గుతామనుకుంటారు. ఇది నిజం కాదు. మధ్యాహ్నాం ఎక్కువగా తీసుకుంటారు. దాంతో బరువు ఎక్కువగా పెరుగుతారు. అందుకే ఒక శాండ్‌విచ్‌ అయినా తీసుకోవాలి.

>> రాత్రి భోజనం తరువాత ఉదయం వరకు మన పొట్ట దాదాపు ఎనిమిది గంటలపాటు ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఉదయం లేచిన గంటా, రెండు గంటల్లోపు ఏదో ఒకటి తినడం మంచిది.

>> అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఆ రోజంతా అలసటగా ఆనిపిస్తుంది. రక్తంలో చక్కెరస్థాయులు కూడా తగ్గుతాయి. దాంతో నీరసంగా మారిపోతారు.

Untitled Document
Advertisements