ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్య

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 04:37 PM

ఏటీఎస్ మాజీ చీఫ్ హిమాన్షు ఆత్మహత్య

ముంబై, మే 11 : మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి హిమాన్షు రాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో చోటుచేసుకుంది. హిమాన్షును గుర్తించిన సిబ్బంది వెంటనే ఆయనను హుటాహుటిన బొంబాయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మృతిని నిర్ధారించారు.

1988 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఐజీ ర్యాంక్‌ అధికారి అయిన ఆయన గత కొంత కాలంగా బోన్‌ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో గత ఏడాదిన్నరగా మెడికల్‌ లీవ్‌లో ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసుల దర్యాప్తుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఛోటారాజన్‌కు శిక్ష పడిన జ్యోతిడే కేసు, ముంబయి 26/11 కేసుతో పాటు 2013 ఐపీఎల్‌ ఫిక్సింగ్ కేసు దర్యాప్తుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.





Untitled Document
Advertisements