ముగిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 07:36 PM

హైదరాబాద్, మే 11 : బేగంపేటలోని మెట్రో రైల్‌ భవన్‌లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సచివాలయం, హైదరాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలను అప్పగించాలని తెలంగాణ అధికారులు కోరగా.. తమ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ అధికారులు వెల్లడించారు.

అయితే ఈ సమావేశంలో.. ఇరు రాష్ట్రాల విభజన వ్యవహారాలను చూస్తున్న రామకృష్ణారావు, ప్రేమ్‌చంద్రారెడ్డి తరచూ సమావేశం కావాలి. డీఎస్పీల విషయంలో హైకోర్టు అనుమతితో తాత్కాలిక కేటాయింపులు చేసుకోవాలి. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలను పరిశీలించాలని అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు.

Untitled Document
Advertisements