గన్నవరంలో 144 సెక్షన్..

     Written by : smtv Desk | Sat, May 12, 2018, 02:26 PM

గన్నవరంలో 144 సెక్షన్..

విజయవాడ, మే 12 : విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గన్నవరం ఎయిర్‌పోర్టు పరిధిలో 144 సెక్షన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీఐపీల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో భద్రతా కారణాల రీత్యా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. శనివారం నుండి జులై 5 వరకు 55 రోజులపాటు ఎయిర్‌పోర్టు, పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఐదుగురు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంతో పాటు ఆందోళనలు, నిరసనలు, బైటాయింపు కార్యక్రమాలు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో నిషేధమని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 250 మీటర్ల పరిధిలో సెక్షన్ అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Untitled Document
Advertisements