జస్ట్ మిస్ అంటే.. ఇదేనేమో..!

     Written by : smtv Desk | Sat, May 12, 2018, 04:54 PM

జస్ట్ మిస్ అంటే.. ఇదేనేమో..!

టాంజానియా, మే 12 : అదేదో సినిమాలో చెప్పినట్లు ఈ ప్రపంచంలో అందరికి ఉమ్మడి శత్రువు ఆకలి. ప్రతి జీవి తన పొట్టనింపుకోవడానికి మిగతా జీవులపై ఆధారపడుతుంది. ఆకలి కంటే ప్రాణం చాలా విలువైనది. ఈ రెండింటి మధ్య పోరులో ప్రాణం నిలిచింది. టాంజానియాలోని ఓ సఫారీ పార్కులో దట్టమైన గడ్డి మాటున ఆకలితో కాపుగాచిన చిరుతపులి వేటు నుండి ఓ గూడకొంగ రెప్పపాటులో తప్పించుకుంది. అద్భుతమైన ఈ సంఘటనను ఓ టూరిస్టు తన కెమేరాలో బంధించాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో... కొంగ పొడవుగా దట్టంగా ఉన్న గడ్డి మధ్య తిరుగుతూ కనిపిస్తుంది. అయితే గడ్డి మాటున నక్కిచూస్తున్న ఓ చిరుత దాన్ని పట్టుకునేందుకు ఉన్నపళాన గాల్లోకి ఎగిరింది. అయితే చిరుతను పసిగట్టిన కొంగ అంతకంటే వేగంగా గాల్లోకి దూసుకెళ్లింది. వెంట్రుకవాసిలో చిరుత పంజా నుంచి తప్పించుకుంది. అత్యంత నాటకీయంగా సాగిన ఈ సన్నివేశాన్ని పాల్ రిఫ్కిన్ (60) అనే టూరిస్టు ఫొటోలు తీయగా.. లారెన్ ఓడియా (32) వీడియో తీశారు.


Untitled Document
Advertisements