ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా..

     Written by : smtv Desk | Sat, May 12, 2018, 08:37 PM

 ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా..

అమరావతి, మే 13 : కన్నా లక్ష్మీనారాయణ భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భాజపా కేంద్ర నాయకత్వం పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం కన్నాకే ఓటు వేసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ఈ నియామక ఉత్తర్వులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ జారీ విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ.. ఎన్నికల అనంతరం కమలం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని మోదీ, జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించి.. ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తానని చెప్పారు.

Untitled Document
Advertisements