పిడుగుపాటుపై అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు నాయుడు

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 11:42 AM

పిడుగుపాటుపై అప్రమత్తంగా ఉండాలి : చంద్రబాబు నాయుడు

అమరావతి, మే 14 : పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతి చెందిన ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. అటు నీరు ప్రగతి, వ్యవసాయంపైనా సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పిడుగులతో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచనలు జారీ చేశారు. పిడుగుల సమాచారం గ్రామాలకు, ప్రజలకు ముందే చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిడుగుల సమాచారం ముందే ఇస్తున్నా ఇంకా మరణాలు సంభవిస్తుండటంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రంతో విభేదించినా తమిళనాడు, కేరళ అభివృద్ధిలో ఉన్నాయని.. వాటి బాటలోనే మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. పట్టణ ప్రాంతాలలో తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. మరో 8వేల మరుగుదొడ్లు నిర్మిస్తే రాష్ట్రంలో 100% ఓడిఎఫ్ పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖలోనూ మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలని.. ఓడీఎఫ్ ప్లస్ పనులకు అన్నిజిల్లాలు సంసిద్ధం కావాలన్నారు. రూ.900కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.





Untitled Document
Advertisements