భయాల్ని ఎక్కువగా ఇష్టపడతా : సమ౦త

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 01:13 PM

భయాల్ని ఎక్కువగా ఇష్టపడతా : సమ౦త

హైదరాబాద్, మే 14 : హీరోయిన్ సమ౦త పెళ్ళయాక కూడా తన జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. వరుస అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోతోంది. 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. సమ౦త ఈ మధ్య కాలంలో నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక 'మహానటి' చిత్రంలో మధురవాణి గా ఆమె నటించిన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఈ పాత్ర కోసం మొదటిసారిగా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది.

ఈ సందర్భంగా సమ౦త మాట్లాడుతూ.. ప్రస్తుతం నా మనసు సవాళ్లని కోరుకుంటోంది. ఛాలెంజ్‌ చేసే పాత్ర ఏదైనా నాకు ఇష్టమే. ఈ పాత్ర చేయగలుగుతానా, లేదా అనే భయం నాలో పుట్టాలి. అలాంటి భయాల్ని ఎక్కువగా ఇష్టపడతా. ఈ మధ్య నానుంచి మంచి సినిమాలు, మంచి పాత్రలు వస్తున్నాయంటే కారణం అదే. నటిగా ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉన్నా. నా స్థానానికి మరింత గౌరవం ఇచ్చే మంచి సినిమాలు చేయడమే నా లక్ష్యం" అంటూ చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements