"హలో" సినిమాకు అరుదైన గుర్తింపు..!!

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 02:28 PM


హైదరాబాద్, మే 14 : అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన "హలో" చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌లో విదేశీ సినిమా కేటగిరీలో ఉత్తమ బెస్ట్‌ యాక్షన్‌ సినిమాగా నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు విక్రమ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

"'హలో' సినిమా విదేశీ సినిమా కేటగిరీలో నామినేట్‌ అయినందుకు గర్వంగా ఉంది. ఇందుకు నాగ్‌ సర్‌కు, అనూప్‌ రూబెన్స్‌, బాబ్‌ బ్రౌన్‌, పీఎస్ ‌వినోద్, ప్రవీణ్‌ పూడిలకు శుభాకాంక్షలు. మీరంతా యాక్షన్‌ ఎపిసోడ్లను మరింత ప్రత్యేకంగా వచ్చేలా చేశారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన అఖిల్‌కు శుభాకాంక్షలు. నీకున్న యాటిట్యూడ్‌ నిన్ను ఉన్నత శిఖరాలు అధిరోహి౦చేలా చేస్తుంది. అలాగే ఉండు. మచ్ లవ్" అని పేర్కొన్నారు. 'హలో' చిత్రాన్ని అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున నిర్మించగా ఇందులో కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటించారు.

Untitled Document
Advertisements