పీఎన్‌బీ కుంభకోణంలో తొలి ఛార్జ్‌షీట్‌..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 03:53 PM

పీఎన్‌బీ కుంభకోణంలో తొలి ఛార్జ్‌షీట్‌..

ముంబై, మే 14 : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) రూ.13,400కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై సీబీఐ తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ముంబయిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన బంధువు మెహుల్‌ ఛోక్సీ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వీరితో పాటు బ్యాంకు మాజీ చీఫ్‌ ఉషా అనంతసుబ్రమణియన్‌తో (ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంకు సీఈవో, ఎండీగా ఉన్నారు) పాటు మరికొందరు ఉన్నతాధికారుల పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఛార్జ్‌ షీట్‌లో నీరవ్‌ను ‘వాంటెడ్‌’గా పేర్కొంది.

ఈ ఏడాది మార్చిలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే స్కాం బయటపడటానికి చాలా రోజుల ముందే ప్రధాన నిందితులైన నీరవ్‌ మోదీ, ఛోక్సీలు దేశం విడిచి పరారయ్యారు. ప్రస్తుతం నీరవ్‌ న్యూయార్క్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిని స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కుంభకోణంలో ఇప్పటివరకు 20 మంది పీఎన్‌బీ ఉద్యోగులను అరెస్టు చేశారు.





Untitled Document
Advertisements