కీర్తి సురేష్ ను సావిత్రితో పోల్చిన సింగీతం..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 04:59 PM

కీర్తి సురేష్ ను సావిత్రితో పోల్చిన సింగీతం..

హైదరాబాద్, మే 14 : ప్రతిభావంతులైన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఆయన అనేక విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అలాంటి అనుభవజ్ఞుడైన ఆయనను మెప్పించడమంటే నిజంగా విశేషమనే చెప్పాలి.

తాజాగా సింగీతం తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది. ఆయన నటి కీర్తి సురేశ్‌తో కలిసి దిగిన ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఆమెను సావిత్రితో పోల్చారు. అంతేకాకుండా.. "ఇప్పటి వరకు నన్ను చాలా మంది నన్ను మీరు సావిత్రి తో దిగిన ఫోటో ఒక్కటైనా ఉందా.? అని. కాని అప్పుడు నేను ఆమెతో ఫోటో దిగలేకపోయాను. కాని ఇప్పుడు నా దగ్గర సావిత్రితో దిగిన ఫోటో ఉంది" అంటూ పోస్ట్ చేశారు.

అంతటి మహానీయుడైన సింగీతాన్ని కీర్తి తన నటనతో మెప్పించింది. ఆమె సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన తీరుకు ఈ పొగడ్తలే నిదర్శనం. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. సావిత్రికి ఆమె జీవం పోశారని అందరూ మెచ్చుకున్నారు.





Untitled Document
Advertisements