'మహానటి' ని అభినందించిన బాలకృష్ణ..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 05:22 PM

'మహానటి' ని అభినందించిన బాలకృష్ణ..

హైదరాబాద్, మే 14 : అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ "మహానటి" చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లోనే దూసుకుపోతోంది. యూఎస్ లో ఈ సినిమా 1.28 మిలియన్ డాలర్ల వసూళ్లను క్రాస్ చేసినట్లు విశ్లేషకులు వెల్లడించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమాలో కీర్తి నటన మహా అద్భుతం అంటూ విమర్శకులు సైతం ప్రశంసించారు.

తాజాగా ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ కుటుంబ సమేతంగా వీక్షించారు. బాలకృష్ణ కోరిక మేరకు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సావిత్రి జీవితాన్ని తెరకెక్కించిన తీరుకు దర్శకనిర్మాతల ప్రయత్నాన్ని ఎంతో అభినందించినట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements