ప్రత్యేకంగా నిహారిక కోసం..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 05:57 PM

ప్రత్యేకంగా నిహారిక కోసం..

హైదరాబాద్, మే 14 : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు. అదిరిపోయే జిహ్వ చాపల్యాన్ని రుచి చూపించగలడు. ఇంట్లో ఉంటే మాస్టర్ చెఫ్ లా చరణ్ వంటగదిలోకి దూరి ప్రయోగాలు చేస్తుంటారు. మొన్నామధ్య తన కుటుంబసభ్యుల కోసం చరణ్ అల్పాహారం రెడీ చేశారంటూ ఆయన భార్య.. ఉపాసన ట్విట్టర్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ,.. 'మాస్టర్‌చెఫ్' అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా చరణ్ మరోసారి గరిట తిప్పారు. కాని ఈసారి తన చెల్లెలు, నటి నిహారిక కోసం ప్రత్యేకంగా చేపల పులుసు వండారట. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చరణ్‌.. "ఇది నేను ఇంట్లో చేసిన ఫిష్‌ కర్రీ.. నిహారిక కోసం ప్రత్యేకంగా చేశా. పులుసు రుచి అదిరిపోయింది" అన్నారు. ఇటీవల "రంగస్థలం"తో మంచి హిట్‌ అందుకున్న చరణ్‌ ప్రస్తుతం తన తర్వాతి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Untitled Document
Advertisements