ఐష్ డ్రెస్ కి ఎంత సమయం పట్టిందో తెలుసా..!!

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 06:23 PM

ఐష్ డ్రెస్ కి ఎంత సమయం పట్టిందో తెలుసా..!!

ఫ్రాన్స్, మే 14 : 71వ కేన్స్‌ చిత్రోత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఈ వేడుకలో హాలీవుడ్‌, బాలీవుడ్ నటీనటులు కళ్లు చెదిరిపోయే వస్త్రాలంకరణలతో ఎర్ర తివాచీపై హోయలొలికిస్తున్నారు. ఇప్పటికే దీపికా పదుకొనే, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రాలు వైవిధ్యమైన దుస్తుల్లో మెరిసిపోయారు.

ఎంతమంది ఉన్నా.. అందరి కళ్ళు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఎక్కడా.! అనే వెతుకుతుంటాయి. గత 17 ఏళ్ల నుంచి ఐష్ కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా, ఫ్రెంచ్‌ కాస్మెటిక్‌ బ్రాండ్‌ లోరియల్‌కు ప్రచారకర్తగా ఈ అతిపెద్ద ఫ్యాషన్‌ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. మరి ఈసారి ఐష్ ఎలాంటి దుస్తుల్లో దర్శనమిస్తుందో అని అందరు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు.

అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఐష్‌ 'సీతాకోకచిలుక'లా డ్రెస్ వేసుకొని ఎర్రతివాచీపై వాలారు. మరి ఇంతటి అందమైన గౌనును డిజైన్‌ చేయడానికి ఎంతో సమయం పట్టిందో తెలుసా..! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3,000 గంటలు పట్టిందట. అంటే దాదాపు 125 రోజులు. ఎంతో కష్టపడి శ్రమిస్తే కానీ, ఈ గౌను డిజైన్‌ పూర్తవ్వలేదట. ఈ డ్రెస్ డిజైన్‌తో పాటు స్వరోవ్‌స్కీ రాళ్లు పొదగడంతో ఈ గౌనుకు మరింత అందం వచ్చింది.

Untitled Document
Advertisements